Govt Recovers : రూ. 15,113 కోట్లు రికవరీ చేశాం
ఆర్థిక నేరగాళ్ల నుంచి వసూలు
Govt Recovers : దేశంలో ప్రభుత్వ బ్యాంకులకు కన్నం వేసి దేశం విడిచి పారి పోయిన ఆర్థిక నేరగాళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్రం. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వందలాది మంది భారత బ్యాంకులకు టోకరా ఇచ్చారు. ఆపై తప్పించుకుని తిరుగుతున్నారు. పటిష్టవంతమైన పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా వారిని ఇండియాకు తీసుకు రాలేక పోతోంది ప్రభుత్వం. విదేశాలతో ఉన్న ఒప్పందాల మేరకు మాత్రమే ఆర్థిక నేరగాళ్లను గుర్తించి పట్టుకుని రావాల్సి ఉంటుంది. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వ ఖజానా నుంచి భారీ ఎత్తున ఖర్చవుతోంది.
Govt Recovers Old Dues
ఇదిలా ఉండగా ఆర్థికంగా పారి పోయిన వారి నుంచి రూ. 15,113 కోట్లను రికవరీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ మాల్యా నుంచి రూ. 9,000 కోట్లు, నీరవ్ మోదీ నుంచి రూ. 13,000 కోట్లు, సందేశరా కుటుంబం నుంచి రూ. 14,500 కోట్ల మోసం, హితేశ్ పటేల్ నుంచి రూ. 14,500 కోట్ల మోసానికి పాల్పడ్డారు.
వీరంతా ప్రజలు దాచుకున్న బ్యాంకుల నుంచి అప్పనంగా రుణాలు పొందారు. వాటితో ఇతర వ్యాపారాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా జునైద్ మెమన్ , హజ్రా మెమన్ , ఆసిఫ్ మెమన్ , రామచంద్రన్ విశ్వనాథన్ కు సంబంధించి ఎంత మేరకు రుణాలు ఎగ్గొట్టారనేది ఇంకా వెల్లడించలేదు.
Also Read : Telangana Assembly Sessions : శాసనసభ సమావేశాలు 3 రోజులు