Eknath Shinde Support : సీఎం షిండేకు పెరుగుతున్న మద్దతు
తమదే అసలైన శివసేన అంటున్న సీఎం
Eknath Shinde Support : శివసేన పార్టీ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి అనూహ్యంగా సీఎం పీఠాన్ని అధిరోహించిన ఏక్ నాథ్ షిండే కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఆయన బీజేపీ సపోర్ట్(Eknath Shinde Support) తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
రేపో మాపో పూర్తి క్యాబినెట్ ఉండబోతోంది. మొత్తం 48 మందితో ఈ మంత్రివర్గం ఉండనుందని సమాచారం. ఇదే సమయంలో తమదే అసలైన శివసేన పార్టీ అంటున్నారు సీఎం షిండే.
ఇందుకు సంబంధించి ఆయన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన రియల్ శివసేన పేరుతో ఫోటోలు, వీడియోలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తున్నారు.
త్వరలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఆటో రిక్షా డ్రైవర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ సీఎం ఇప్పుడు దేశ రాజధాని ముంబైని నడిపిస్తుండడం విశేషం. మొదట కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.
ఏక్ నాథ్ షిండేకు ముంబైకి ఆనుకుని ఉన్న థానేపై మంచి పట్టుంది. ఒక రకంగా చెప్పాలంటే మాస్ లీడర్ గా పేరుంది. మరో వైపు శివసేన పార్టీపై పట్టు సాధించేందుకు షిండే పావులు కదుపుతున్నారు.
తనదైన శైలిలో సత్తా చాటుతున్నారు. థానే, కళ్యాణ్ డోంబి వాలి , నవీ ముంబై లోని పౌర సంస్థలకు చెందిన సభ్యులు సీఎంను కలిశారు. తమ మద్దతు ప్రకటించారు.
ఇదిలా ఉండగా మాజీ కార్పొరేటర్లతో పాటు శివసేన, యువసేన, మహిళా అఘాడీ ఆఫీస్ బేరర్లు , శివ సైనికులు నన్ను వచ్చి కలిశారంటూ సీఎం ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు.
Also Read : రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన ఎంపీలు ఎటు వైపు