CM Yogi Adityanath : రాకెట్ కంటే వేగంగా అభివృద్ది – యోగి
యూపీ సీఎం ఆదిత్యానాథ్ వెల్లడి
CM Yogi Adityanath : రాకెట్ కంటే స్పీడ్ గా యూపీ అభివృద్దిలో దూసుకు పోతోందని స్పష్టం చేశారు సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath). ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ ఎనిమిదో సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం ముందంజలో కొనసాగుతోందని ఆయన అందించిన స్పూర్తి, సంస్కరణ, పనితీరు, పరివర్తన మంత్రాన్ని తాము అవలంభిస్తున్నామని చెప్పారు. అందుకే అభివృద్ది అన్నది సాధ్యమైందన్నారు.
దేశంలో పారిశ్రామిక పెట్టుబడులకు రాష్ట్రం కలల గమ్య స్థానంగా మారిందని స్పష్టం చేశారు సీఎం. మహిళల భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ది , పీఎం గతి శక్తి, ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాలలో యూపీ గణనీయమైన విజయాలను స్వంతం చేసుకుందన్నారు యోగి. దాదాపు 25 కోట్ల జనాభా ఉన్న యూపీ రాష్ట్రం భారత దేశంలోనే అతి పెద్ద వినియోగదారు, కార్మిక మార్కెట్ గా మారిందన్నారు.
సమృద్దిగా సహజ వనరులతో పాటు గంగా వంటి నిరంతరం ప్రవహించే నదుల ఉనికితో సారవంతమైన మైదానాలను కలిగి ఉందన్నారు యోగి ఆదిత్యానాథ్. గతంలో పాలకులు అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మార్చేశారని కానీ తాము వచ్చాక నేరాలు, అవినీతి పట్ల ఏ మాత్రం సహించని విధానాన్ని కలిగి ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని సంకల్పించిందన్నారు.
Also Read : Indian Army Chief
