GST Collections November : 11 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ఏకంగా రూ. 1.46 లక్షల కోట్లు
GST Collections November : దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో కోట్లు సమకూరాయి. ఏకంగా ఈసారి గత నవంబర్ నెలకు సంబంధించి మొత్తం దేశ వ్యాప్తంగా 11 శాతం(GST Collections November) పెరిగింది. ఏకంగా రూ. 1, 45,867 కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మొత్తం వసూలైన జీఎస్టీలో కేంద్రం నుంచి రూ. 25,681 కోట్లు కాగా రాష్ట్రాల నుంచి అందిన జీఎస్టీ రూ. 32,651 కోట్లు. అంతర్గత వస్తు సేవల కు సంబంధించి రూ. 77,103 కోట్లు వసూలైయ్యాయి. ఇందులో కేవలం వస్తువుల దిగుమతులపై రూ. 38, 635 కోట్లు వచ్చాయి. ఇక సెస్ (సుంకం) కింద రూ. 10, 433 కోట్లు అందాయి.
ఇందులో వస్తువుల దిగుమతిపై రూ. 817 కోట్లు సేకరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతంలో కంటే గత నెల నవంబర్ లో జీఎస్టీ నెల వారీ సేకరణ అత్యధికంగా ఉందని స్పష్టం చేసింది. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊతం ఇస్తుందని పేర్కొంది.
ఇదిలా ఉండగా వరుసగా తొమ్మిది నెలల్లో రూ. 1.40 కోట్ల మార్కును అధిగమించడం ఓ రికార్డు(GST Collections November) అని వెల్లడించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇదిలా ఉండగా ఇది రెండో స్థానం ఆక్రమించింది. ఎందుకంటే ఈ ఏడాది ఆయా నెలల వారీగా జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే గత అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
ఈ ఒక్క నెలలోనే దేశ వ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ. 1.52 లక్షల కోట్లు గా నమోదైంది. ఇది మొదటి అత్యధిక వసూళ్లలో రికార్డుగా చెప్పవచ్చని పేర్కొంది ఆర్థిక శాఖ.
Also Read : దేశంలో విలువైన కంపెనీలు ఇవే