GST Officers Raids : కోమటిరెడ్డి ‘సుశీ ఇన్ ఫ్రా’లో సోదాలు
రాష్ట్ర జీఎస్టీ అధికారుల దాడులు
GST Officers Raids : మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడి పోయాడు. అధికార పార్టీకి చెందిన ప్రభాకర్ రెడ్డి గెలుపొందాడు. ఆ తర్వాత టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణను జల్లెడ పడుతుంటే రాష్ట్రానికి చెందిన జీఎస్టీ అధికారులు తామేమీ తక్కువ కాదంటూ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ ఇచ్చారు.
సోమవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు. ఓ వైపు ఆయన మునుగోడులో గొల్ల కురుమలకు అన్యాయం జరిగిందని, ప్రగతి భవన్ ను ముట్టడిస్తానంటూ హెచ్చరించారు. మరోవైపు ఆయనకు చెందిన ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటల నుంచి 20 మంది అధికారులతో కూడిన టీఎం దాడులు(GST Officers Raids) జరిపింది.
మొత్తం రికార్డులను పరిశీలిస్తున్నారు. సరిగ్గా ఉన్నాయో లేదోనని పరీక్షిస్తున్నారు. సుశీ ఇన్ ఫ్రా అనేది మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిష్టర్ అయ్యింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది రాజగోపాల్ రెడ్డిపై. ఆయన రూ. 18,000 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కించు కున్నాడని , అందినంత మేర దండుకోండి అంటూ ప్రచారం చేసింది టీఆర్ఎస్.
దీనికి సంబంధించి సమాధానం ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు కోమటిరెడ్డి. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి నుంచి రక్షించ లేక పోయింది. అమిత్ షా వచ్చినా కేసీఆర్ పాచికల ముందు తలవంచక తప్పలేదు.
మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే బోయినపల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేసింది. ఈ తరుణంలో బీజేపీ నేతకు ఝలక్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : దాడులకు భయపడను సీఎంను వదలను