Gudivada Amarnath : 352 ఒప్పందాలు రూ. 13.6 లక్షల కోట్లు
వెల్లడించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
Gudivada Amarnath Global Summit : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది. అంచనాలకు మించి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడడంతో సంతోషానికి లోనవుతోంది ఏపీ సర్కార్. మొదట్లో కనీసం రూ. 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ మెంట్ రూపంలో వస్తాయని అనుకున్నారు. కానీ ఏకంగా రూ. 13.6 లక్షల కోట్లు రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ క్రెడిట్ అంతా తమ నాయకుడు , ఏపీ సారథి సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైందని కితాబు ఇచ్చారు రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) .
విశాఖపట్టణంలో ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ 2023 ముగిసింది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారస్తులు హాజరయ్యారు. జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు, అదానీ గ్రూప్ సిఇఓ , గౌతం అదానీ కుమారుడు , రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ తో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కూడా హాజరయ్యారు. సదస్సు ముగిసిన అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
352 ఒప్పందాల వల్ల ఏపీలో దాదాపు 6 లక్షల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయని మంత్రి వెల్లడించారు. మొదట రూ. 5 లక్షల కోట్లు వస్తాయని భావించామన్నారు. కానీ అంతకు డబుల్ రెట్లు వచ్చాయని ఇది సంతోషకరమని పేర్కొన్నారు గుడివాడ అమర్నాథ్. ఈ సదస్సులో 100 దేశాలకు చెందిన ప్రతినిధులు, 7 దేశాల రాయబారులు పాల్గొన్నారని వెల్లడించారు.
పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పారు. సదస్సును సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నామని చెప్పారు మంత్రి(Gudivada Amarnath Global Summit) .
Also Read : తెలంగాణకు కేంద్రం శుభవార్త