Gudivada Amarnath : చంద్రబాబుకు జైలు శిక్ష తప్పదు
ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్
Gudivada Amarnath : విజయవాడ – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ లో కీలకమైన సూత్రధారి, పాత్రధారి నారా చంద్రబాబు నాయుడని స్పష్టం చేశారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇప్పటికే ఐటీ శాఖ నోటీసులు అందజేసిందన్నారు. రూ. 118 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాడని ఆరోపించిన విషయం మరిచి పోయారా అని ప్రశ్నించారు.
Gudivada Amarnath Comments on Chandrababu
చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ఇప్పటికీ కనిపించకుండా తిరుగుతున్నాడని అన్నారు. శనివారం గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మీడియాతో మాట్లాడారు. ప్రజల సొమ్మును అడ్డంగా దోచేశారని ఆరోపించారు. ఏకంగా రూ. 550 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా హవాలా డబ్బులు చేతులు మారాయని స్పష్టం చేశారు.
చంద్రమండలానికి వెళ్లినా బాబును అరెస్ట్ చేసి తీరుతామని ఇప్పటికే చెప్పామన్నారు. ప్రజా సంపద దోపిడీకి పాల్పడిన బాబుకు శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు. ఆయన చేసిన మోసానికి, కుట్రకు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడటం ఖాయమన్నారు.
ఓ వైపు తప్పులు చేస్తూ మరోవైపు నీతులు వల్లిస్తే జనం నమ్ముతారని అనుకోవడం దారుణమన్నారు. 45 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉన్నా అరెస్ట్ , శిక్ష తప్పదన్నారు. నైపుణ్యాభివృద్ది పేరుతో మోసానికి పాల్పడటమే కాకుండా అబద్దాలు చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్థుడిగా ఇప్పటికే పేరు పొందాడని ఆరోపించారు.
Also Read : Chanrababu Naidu : ఏపీ స్కీం స్కామ్ లో బాబు కుట్రదారు