Gudivada Amarnath : బాబు శేష జీవితం జైలు లోనే
ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్
Gudivada Amarnath : ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ నిప్పులు చెరిగారు. ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. రాజధాని పేరుతో ఆనాడే అవినీతిని ఎండగట్టామని చెప్పారు. అవినీతిలో కింగ్ మేకర్ చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.
Gudivada Amarnath Slams Chandrababu Naidu
రాజకీయాల్లోకి రాక ముందు కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉన్న చంద్రాబు నాయుడికి ఇవాళ లక్ష కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఐటీ మంత్రి డిమాండ్ చేశారు. హెరిటేజ్ పేరుతో నిలువు దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించారు.
రాష్ట్రంలో ఉన్న వనరులను దోచుకున్న గజ దొంగ చంద్రబాబు అని సంచలన ఆరోపణలు చేశారు. ఐటీ నోటీసులపై తండ్రీ కొడుకులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath). చంద్రబాబు పాపం పండిందని , అందుకే పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడంటూ ధ్వజమెత్తారు.
పీకల లోతు అవినీతి కేసులో కూరుకు పోయాడని చంద్రబాబును ఆ దేవుడు కూడా రక్షించ లేడని పేర్కొన్నారు. 2024 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కనుమరుగు లేకుండా పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. బాబు భార్యను ఎవరూ పల్లెత్తి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ అన్నట్లు బిల్డప్ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు.
Also Read : TTD Chairman : వినాయక నిమజ్జనం సంపూర్ణ సహకారం