Gopal Italia : గుజ‌రాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా అరెస్ట్

గుజ‌రాత్ ఆప్ చీఫ్ ఇటాలియా అరెస్ట్

Gopal Italia : ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. త్వ‌ర‌లో గుజ‌రాత్ లో పాగా వేయాల‌ని అనుకుంటున్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఢిల్లీలోని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యంలో ఆందోళ‌న చేప‌ట్టిన గుజ‌రాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆయ‌న‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించారు. త‌న‌కు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స‌మ‌న్లు జారీ చేసింది. దీనిని నిర‌సిస్తూ గోపాల్ న‌టాలియా(Gopal Italia) ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. 

దీనిపై క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ తీవ్రంగా స్పందించారు. ఏదైనా ఉంటే న్యాయ బ‌ద్దంగా కోరాల‌ని కానీ ఇలా త‌మ పైకి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఢిల్లీ పోలీసులు రంగంలోక దిగారు. వెంట‌నే ఆందోళ‌న‌కారుల‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ గుజ‌రాత్ రాష్ట్ర చీఫ్ గోపాల్ ఇటాలియాను అరెస్ట్ చేశారు. గురువారం నిర‌స‌న‌కు దిగిన కొన్ని గంట‌ల త‌ర్వాత ఈ అరెస్ట్ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కాగా వివాదాస్ప‌ద వీడియోపై గోపాల్ ఇటాలియాకు(Gopal Italia) జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రేఖా శ‌ర్మ స‌మ‌న్లు జారీ చేశారు. ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ ఆప్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యం ముందు నిర‌స‌న‌కు దిగారు.

గోపాల్ ఇటాలియా మ‌ద్ద‌తుదారులు బ‌ల‌వంతంగా కార్యాల‌యం లోప‌లికి ప్ర‌వేశించేందుకు య‌త్నించారంటూ చైర్ ప‌ర్స‌న్ ఆరోపించారు. ఈ మేర‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Also Read : ఎన్నిక‌ల సంఘం ప‌క్ష‌పాతం – ఠాక్రే

Leave A Reply

Your Email Id will not be published!