Gujarat Election Poll : గుజ‌రాత్ లో తొలి విడ‌త పోలింగ్

ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య బిగ్ ఫైట్

Gujarat Election Poll : గుజ‌రాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి మొద‌టి విడ‌త పోలింగ్ ప్రారంభ‌మైంది. మొత్తం 182 స్థానాల‌కు గాను ఈసారి అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

తొలి విడ‌త డిసెంబ‌ర్ 1న‌, మ‌లి ద‌శ పోలింగ్ ఈనెల 5న జ‌ర‌గ‌నుంది. ఇక మొద‌టి విడ‌త‌లో భాగంగా మొత్తం 89 స్థానాలకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం ఎన్నిక‌ల(Gujarat Election Poll) బ‌రిలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లో 788 మంది అభ్య‌ర్థులు నిల‌బ‌డ్డారు. ఇప్ప‌టికే అన్ని పార్టీలు స‌ర్వ శ‌క్తులు కేంద్రీక‌రించాయి.

ఈ ఎన్నిక‌లు ప్ర‌ధానంగా బీజేపీకి , ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షాకు అగ్నిప‌రీక్ష‌గా మారాయి. గ‌త ఎన్నిక‌ల్లో రెండు పార్టీల మ‌ధ్యే ఉండేది పోటీ. కానీ ఈసారి ఆప్, ఎంఐఎం కొత్తగా ఎంట్రీ ఇచ్చాయి. గురువారం ఉద‌యం 8 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల దాకా పోలింగ్ కొన‌సాగుతుంది.

వ‌రుస‌గా మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని కాషాయం య‌త్నించ‌గా ఎలాగైనా బీజేపీ కంచు కోట‌ను ఛేదించాల‌ని కాంగ్రెస్ స‌ర్వ శ‌క్తులు ఒడ్డింది. ఇక ఆప్ ఎంట్రీతో సీన్ మార్చేలా చేసింది. ఇక గుజ‌రాత్, సౌరాష్ట్ర , క‌చ్ ఓట‌ర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా పురుష ఓట‌ర్లు 1,24,33,362 మంది ఉండ‌గా మ‌హిళా ఓట‌ర్లు 1,14,42,811 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండ‌ర్లు 497 మంది ఉన్నార‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది.

Also Read : పంజాబ్ సీఎం ఇల్లు ముట్ట‌డి ఉద్రిక్తం

Leave A Reply

Your Email Id will not be published!