Gujarat Election Results : గుజరాత్ లో కమలం ప్రభంజనం
ఏడోసారి అధికారంలోకి బీజేపీ
Gujarat Election Results : గుజరాత్ లో తమకు ఎదురే లేదని చాటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ చంద్ర షా. గతంలో గణనీయమైన సీట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నష్ట పోయింది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్ ఓటు బ్యాంకును గండి కొట్టాయి. దీంతో భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరింది.
ఇక బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలింది. హిమచల్ ప్రదేశ్ లో హస్తం ముందంజలో కొనసాగుతోంది. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ 158 స్థానాల్లో ఆధిక్యంలో(Gujarat Election Results) కొనసాగుతోంది. గత ఎన్నికల్లో టాప్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 17 స్థానాల్లోనే లీడ్ లో ఉంది.
2017లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే దాదాపు 60 సీట్లను కోల్పోయింది. ఆ పార్టీని విస్తు పోయేలా చేసింది. పవర్ లోకి వస్తామని బీరాలు పలికిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 4 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో వైపు ఎంఐంఎం సీట్లను చేజిక్కించుకోక పోయినా ఓటు బ్యాంకును మాత్రం చీల్చడంలో కీలక పాత్ర పోషించింది.
ఇక హిమాచల్ ప్రదేశ్ లో 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. పార్టీ సంఖ్య 40కి చేరుకుంటే ఆపరేషన్ కమలం భయం లేదని స్పష్టం చేశారు. ఈ శుక్లా ఎవరో కాదు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్.
Also Read : మరాఠాపై బీజేపీ కుట్ర – సుప్రియా సూలే