Gujarat Election Schedule : గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
Gujarat Election Schedule : ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు (Gujarat Election Schedule) సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసింది. పూర్తి నోటిఫికేషన్ ఈనెల 5న శనివారం విడుదల చేస్తామని వెల్లడించారు చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. గురువారం సీఈసీ మీడియాతో మాట్లాడారు.
డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ జరుగుతుందని, 8వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో జనరల్ స్థానాలు 142 ఉండగా ఎస్సీలకు సంబంధించి 12 సీట్లు , ఎస్టీ కేటగిరకి 27 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 51 వేల 782 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, మొత్తం ఓటర్లు 4 కోట్ల 90 లక్షలు ఉన్నారని తెలిపారు సీఈసీ. పురుషుల ఓటర్లు 2 కోట్ల 53 లక్షల ఓటర్లు ఉండగా మహిళలు 2 కోట్ల 37 లక్షల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ట్రాన్స్ జెండర్స్ 1,417 ఓటర్లు ఉన్నాయని తెలిపారు.
ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా గుజరాత్ లో 27 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ పవర్ లోకి ఉంది. 217 మంది ఓటర్ల కోసం కంటైనర్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు రాజీవ్ కుమార్.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 77 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది.
గతంలో రాష్ట్రంలో ద్విముఖ పోటీ ఉండగా ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ కొనసాగనుంది.
Also Read : ఆరు రాష్ట్రాలలో ఉప ఎన్నికల పోలింగ్