Rahul Gandhi : రాహుల్ అభ్యర్థన కోర్టు తిరస్కరణ
వేరే బెంచ్ కు అప్పగించాలని నిర్ణయం
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి(Rahul Gandhi) బిగ్ షాక్ తగిలింది. మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ చేసిన అప్పీల్ ను విచారించేందుకు కేటాయించిన గుజరాత్ హైకోర్టు జడ్జి విరమించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరుపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో శిక్షను వాయిదా వేయాలన్న తన అభ్యర్థనను సూరత్ కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ.
ఈ కేసును వేరే బెంచ్ కి అప్పగించేందుకు ప్రధాన న్యాయమూర్తికి అప్పగించాలని న్యాయమూర్తి గీతా గోపి కోర్టు రిజిస్ట్రీని ఆదేశించినట్లు సమాచారం. కొత్త న్యాయమూర్తిని నియమించేందుకు మరో రెండు రోజులు పట్ట వచ్చని రాహుల్ గాంధీ(Rahul Gandhi) తరపు న్యాయవాది పీఎస్ చపనేరి వెల్లడించారు. 2019లో కర్ణాటకలో ఓ సభలో మోదీ పేరు కలిగిన వారంతా ఆర్థిక నేరస్థులేనన్న అర్థం వచ్చేలా కామెంట్స్ చేశాడు. దీనిపై చర్య తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన కోర్టు రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ వెంటనే లోక్ సభ స్పీకర్ రాహుల్ గాంధీ లోక్ సభ అభ్యర్థిత్వం చెల్లదంటూ అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత లోక్ సభ కమిటీ వెంటనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇటీవలే రాహుల్ గాంధీ తన ఇంటిని ఖాళీ చేశారు.
Also Read : సిద్దరామయ్య కామెంట్స్ యెడ్డీ సీరియస్