Gujarat Himachal Pradesh : గుజరాత్..హిమాచల్ ఓట్ల లెక్కింపు
అసెంబ్లీ ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ
Gujarat Himachal Pradesh : అత్యంత ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్(Gujarat Himachal Pradesh) లలో జరిగాయి. గురువారం రెండు రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలు మధ్యాహ్నం వరకు వెలువడనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. కానీ ఆ పార్టీ ఉన్న పవర్ ను కోల్పోయింది.
15 ఏళ్ల పాటు కొనసాగిన అధికారాన్ని కాషాయం పోగొట్టుకుంది. ఒక రకంగా ఆప్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ తరుణంలో ఢిల్లీ రిజల్ట్స్ గుజరాత్ లో రిపీట్ అవుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపాయి.
గత 27 ఏళ్లుగా గుజరాత్ లో కంటిన్యూగా కమల దళం అధికారంలో ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో సైతం బీజేపీ నేతృత్వం వహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ట్రబుల్ షూటర్ , కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా అన్నీ తానై వ్యవహరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తన స్వంతంగా భావించే గుజరాత్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మొత్తం 182 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. పంజాబ్ లో కొనసాగిన విజయ పరంపర ఢిల్లీలో రిపీట్ అయిందని ఇక సేమ్ సీన్ గుజరాత్ లో కొనసాగుతుందన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.
ఇక హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 సీట్లు ఉండగా నవంబర్ 12న పోలింగ్ జరిగింది. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో ఉండే ఛాన్స్ ఉంది.
Also Read : మరాఠాపై బీజేపీ కుట్ర – సుప్రియా సూలే