Modi : ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా భావించే రవిదాస్ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఢిల్లీలోని రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేశారు. భక్తులతో కలిసి భజనలు చేశారు.
ఇదిలా ఉండగా రవిదాస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింది. రవిదాస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ(Modi).
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధువు చూపిన మార్గం గొప్పదన్నారు. ఆయన చూపిన దారిని మనమంతా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
సమానత్వం, సమారస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు దేశ ప్రజలు సహకరించాలని కోరారు. రవిదాస్ వ్యక్తి కాదు ఆధ్యాత్మిక శక్తి. ఆయన గొప్ప గురువు. రవిదాస్ జీ ఎలాంటి వివక్ష లేకుండా పరస్పర ప్రేమ, సమానత్వంతో వ్యవహరించాలని సదేశాన్ని ఇచ్చారు.
తోటి వారిని ప్రేమించాలని, ద్వేష భావాన్ని విడనాడాలని పిలుపునిచ్చారని అన్నారు మోదీ(Modi). కరోల్ బాగ్ లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్ ఇవాళ భక్తులతో నిండి పోయింది.
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి ఈ గురు రవి దాస్ జయంతి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మోదీ ఏకంగా భక్తులతో మమేకమై ఆలయంలో షాబాద్ కీర్తనల్లో పాల్గొన్నారు.
సందర్శకుల పుస్తకంపై పోస్ట్ చేసిన సందేశంలో గురు రవిదాస్ జీవితం ఓ ప్రేరణగా ఉంటుందని స్పష్టం చేశారు. రవిదాస్ జయంతి కావడంతో ఎన్నికల సంఘం పంజాబ్ లో పోలింగ్ తేదిని మార్చింది. 20 లక్షల మందికి పైగా దర్శించుకుంటారు.
Also Read : ఆదివాసీ ఉత్సవం మేడారం జనసంద్రం