Guvvala Balaraju : అచ్చంపేట – తనను అంతం చేయాలనే కుట్ర తోనే పదే పదే కాంగ్రెస్ గూండాలు దాడులకు దిగుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. మొన్నటికి మొన్న భౌతికంగా దాడి చేశారని, ఇవాళ మరోసారి ఇటుకతో దాడికి యత్నించారని అన్నారు.
Guvvala Balaraju Counter
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్రాబాద్ మండలం కుమ్మరోళ్లపల్లి గ్రామానికి చేరుకున్న సమయంలో గువ్వల బాల రాజు(Guvvala Balaraju)పై ఒకరు ఇటుక తో దాడి చేశారు. పెద్దగా గాయం కాలేదు. కానీ గువ్వల బాల రాజు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ సందర్భంగా తనను టార్గెట్ చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తానని అన్నారు.
ఇదంతా కాంగ్రెసోళ్ల పనేనని ఆరోపించారు గువ్వల బాలరాజు. ప్రజా క్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచ, నికృష్ణ చేష్టలకు దిగుతున్నారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు బొంద పెట్టుడు ఖాయమని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరకు గెలిచేది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు గువ్వల బాలరాజు. మొత్తం 119 సీట్లకు గాను తమకు 100 సీట్లు పక్కాగా వస్తయని అన్నారు. తిరిగి తమ సీఎం ముచ్చటగా మూడోసారి సీఎం అవుతాడని ఇది రికార్డ్ అని పేర్కొన్నారు.
Also Read : Revanth Reddy : గెలుస్తా కేసీఆర్ కు షాకిస్తా