GVL Narasimha Rao : పోల‌వ‌రం కోసం రూ. 12,911 కోట్లు

బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు

GVL Narasimha Rao : ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు(GVL Narasimha Rao) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు త‌మ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని చెప్పారు. రాజ‌కీయ ల‌బ్ది ఆశించ‌కుండా రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం రెవెన్యూ లోటు భ‌ర్తీకి ఏపీకి ప్ర‌ధాని మోదీ నిధులు మంజూరు చేశార‌ని తెలిపారు.

రూ. 10 వేల 461 కోట్ల రూపాయ‌లు రెవెన్యూ గ్రాంట్ గా ఏపీకి కేటాయించింద‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీకి నిధులు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారంటూ య‌క్ష ప్ర‌శ్న‌లు వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు. ఇలాంటి ప‌రిస్థితి ఏ రాష్ట్రంలో ఉండ‌ద‌న్నారు. న‌రేంద్ర మోదీ రాజ‌కీయ ల‌బ్ది కోసం ప‌ని చేయ‌ర‌ని, ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తార‌ని స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధుల‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా ఖ‌ర్చు చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు అద‌నంగా రూ. 12 వేల 911 కోట్ల రూపాయ‌లు కేటాయించిన‌ట్లు తెలిపారు. పోల‌వ‌రం 41.15 మీట‌ర్ల వ‌ర‌కు తొలి ద‌శ నిర్మాణం కోసం నిధులు కేంద్రం ఇస్తుంద‌న్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం వైఫ‌ల్యాల‌ను ఛార్జిషీట్ ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌న్నారు.

Also Read : YS Jagan

Leave A Reply

Your Email Id will not be published!