Gyanvapi Case : జ్ఞాన్ వాపి కేసు విచార‌ణ‌18కి వాయిదా

ఆదేశించిన జ‌స్టిస్ ప్ర‌కాశ్ పాడియా

Gyanvapi Case : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన యూపీ జ్ఞాన్ వాపి కేసుకు(Gyanvapi Case) సంబంధించి త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 18కి వాయిదా వేసింది కోర్టు. సంబ‌ధిత ప‌క్షాల వాద‌న‌ల‌ను జ‌స్టిస్ ప్ర‌కాష్ పాడియా విన్నారు.

ఈ మేర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ కేసుకు సంబంధించి ఆగ‌స్టు 30న హైకోర్టు మ‌ధ్యంత‌ర స్టేను సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగించింది. కాశీ విశ్వ‌నాథ దేవాల‌యం – జ్ఞాన్ వాపి మ‌సీదు స‌ముదాయంలో స‌ర్వే నిర్వ‌హించాల‌ని భార‌త పురావ‌స్తు శాఖ‌ను వార‌ణాసి కోర్టు ఆదేశించింది.

కోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై అల‌హాబాద్ హైకోర్టు స్టేను అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు పొడిగించింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్నారు జ‌డ్జి. ఏప్రిల్ 8, 2021 నాటి వార‌ణాసి కోర్టు ఉత్త‌ర్వుల‌పై ఆగ‌స్టు 30న హైకోర్టు మ‌ధ్యంత‌ర స్టేను విధిస్తూ సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగించింది.

వార‌ణాసి లోని జ్ఞాన్ వాపి మ‌సీదు నిర్వ‌హ‌ణ క‌మిటీ అంజుమ‌న్ ఇంతేజామియా మ‌సీదు వార‌ణాసి జిల్లా కోర‌ట్ఉలో 1991లో దాఖ‌లు చేసిన అస‌లు దావా నిర్వ‌హ‌ణ‌ను స‌వాల్ చేస్తూ పిటిష‌న్ ను దాఖ‌లు చేసింది.

ప్ర‌స్తుతం జ్ఞాన్ వాపి(Gyanvapi Case) మ‌సీదు ఉన్న ప్ర‌దేశంలో పురాత‌న కాశీ విశ్వ‌నాథ్ ఆల‌యాన్ని పున‌రుద్ద‌రించాల‌ని పిటిష‌నలో కోరారు. మ‌సీదు ఆల‌యంలో భాగ‌మ‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 12న జ‌స్టిస్ పాడియా ఏఎస్ఐ దాఖ‌లు చేసిన కౌంట‌ర్ అఫిడ‌విట్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇది జాతీయ స్థాయిలో ప్రాధాన్య‌త క‌లిగిన అంశంగా ఉంద‌న్నారు. త‌న వ్య‌క్తిగ‌త అఫిడ‌విట్ ను 10 రోజుల్ల‌గా దాఖ‌లు చేయాల‌ని డైరెక్ట‌ర్ జన‌ర‌ల్ ను ఆదేశించారు.

Also Read : కాంగ్రెస్ చీఫ్ గా ప్రియాంక గాంధీ బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!