H1B Visa Stamping : త్వరలో హెచ్-1బి వీసా స్టాంపింగ్
ప్రెసిడెంట్ జో బైడెన్ లైన్ క్లియర్
H1B Visa Stamping : అమెరికాకు వెళ్లాలని అనుకునే వారికి ఖుష్ కబర్ చెప్పింది అమెరికా ప్రభుత్వం. ఇప్పటికే లక్షలాదిగా వీసాలు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది భారత ప్రభుత్వం. ప్రత్యేకించి అమెరికాకు భారత్ నుంచే ఎక్కువగా వెళుతుంటారు. మిగతా దేశాల వారు చాలా తక్కువ.
ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, ఇతర రంగాలలో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు పనిచేస్తున్నారు. కరోనా పేరుతో స్టాంపింగ్ అనేది ఆలస్యం కావడంతో చదువు కోవాలని అనుకునే స్టూడెంట్స్, జాబ్స్ చేసేందుకు పర్మిషన్ వచ్చిన వారు, అమెరికాలో తమ వారిని కలుసుకునేందుకు వెళ్లే వారంతా ఇప్పుడు నేల చూపులు చూడాల్సి వస్తోంది.
దీనికి ప్రధాన కారణంగా అమెరికా నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. వీసాల జారీకి సంబంధించి స్టాంపింగ్ గురించి పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు భారత దేశం ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. ఆయన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో భేటీ అయ్యారు.
ప్రధానంగా ఈ ప్రధాన సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై సీరియస్ గా స్పందించారు బ్లింకెన్. ఈ తరుణంలో కీలక ప్రకటన వెలువడింది. త్వరలో యుఎస్ లో హెచ్ -1బి వీసా స్టాంపింగ్(H1B Visa Stamping) కు ఆమోదం తెలిపేందుకు నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ సంతకం చేయనున్నారు.
ఆయన లైన్ క్లియర్ చేస్తే ఇక వీసాల జారీ మొదలవుతుంది జోరుగా. విదేశీ నిపుణులకు మేలు చేకూరనుంది. ఈ హెచ్ 1బి వీసా అనేది సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించు కునేందుకు అనుమతి ఇస్తుంది. అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా భారత్, చైనా ఉద్యోగులపై ఆధారపడతాయి.
Also Read : రిచ్ లిస్ట్ లో నిఖిల్ కామత్ నెంబర్ వన్