అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవడంలో..ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో..తనకు ఏది తోస్తే అది అమలు పర్చడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే ప్రెసిడెన్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఎడా పెడా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇండియన్లకు భారతదేశం కంటే యుఎస్ మీదనే అధిక ప్రేమ. మన వాళ్లే అక్కడి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలలో అత్యధికంగా పని చేస్తున్నారు. అక్కడ ఉద్యోగం చేయాలన్నా..విజిటింగ్ చేయాలన్నా..వర్క్ పర్మిట్లు పొందాలన్నా తప్పనిసరిగా ఆ దేశ ప్రభుత్వం జారీ చేసే హెచ్1బి వీసాలు కావాల్సిందే. పాస్‌పోర్టు పొందడం ఒక ఎత్తు ఈ వీసా పొందడం మరో ఎత్తు. తాజాగా టెక్కీలకు మరో సారి కోలుకోలేని షాక్ ఇచ్చారు ట్రంప్. వచ్చే మార్చి నెల 31 దాకా పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
వీటితో పాటు ఇతర విదేశీ వర్క్ వీసాలు..గ్రీన్ కార్డులపై బ్యాన్ ను ఎక్సెటెండ్ చేశారు. అయితే ట్రంప్ తన నిషేధపు నిర్ణయాన్నిసమర్థించుకున్నారు. అమెరికా దేశ ప్రయోజనాల కోసం..ఇక్కడి దేశస్థులకు మంచి చేయాలన్న సదుద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. కాగా గత సంవత్సరం ఏప్రిల్ 22, జూన్ 22న రెండు సార్లు హెచ్ 1 బి వీసాలపై విధించిన నిషేధాన్ని పొడిగించారు. జారీ చేసిన ఉత్తర్వుల గడువు కాలం డిసెంబర్ నెలాఖరుతో పూర్తి కావడంతో తన ప్రత్యర్థి బైడన్ పై ఉన్న కోపంతో ఈ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారని అక్కడి వాసులు స్పష్టం చేస్తున్నారు. ప్రవాస భారతీయుల నుంచి అత్యధికంగా ఆదాయం మన ఇండియాకు సమకూరుతోంది. దీనిని అడ్డుకునేందుకే ఇలా చేశామంటున్నారు ట్రంప్ మద్ధతుదారులు.
కేవలం 20 రోజులే మిగిలాయి ట్రంప్ తన పదవి నుంచి దిగి పోవడానికి. అమెరికాలోకి ఇమ్మిగ్రెంట్లను అడ్డుకునే చర్యలకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు ట్రంప్ తీసుకున్నఒంటెద్దు పోకడల గురించి తాజాగా జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల సందర్భంగా బైడన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు గనుక అధికారం అప్పగిస్తే ట్రంప్ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలను రద్దు చేస్తామని..అమెరికా ప్రపంచంలోని ప్రజలందరికి స్వర్గ ధామంగా ఉండాలన్నదే తమ ధ్యేయమంటూ స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ట్రంప్ కు జనం ఛీ కొట్టడం బైడన్ కు జై కొట్టడం జరిగింది. హెచ్ 1 బి వీసాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరో వైపు వివిధ దేశాల్లోని 70కి పైగా ఉగ్రవాద సంస్థలకు 460 కోట్ల నిధుల మంజూరు కాకుండా బ్లాక్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని శాంతిని కోరుకునే దేశాలు స్వాగతించాయి.
No comment allowed please