Bhagat Singh Tribute : షహీద్ భగత్ సింగ్ కు దేశం సలాం
వెల్లువెత్తుతున్న ప్రముఖల నివాళి
Bhagat Singh Tribute : దేశ స్వతంత్రం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన వాడు. దేశం కంటే చావు గొప్పది కాదని చాటిన వాడు. భారత మాత బిడ్డగా నేటికీ కోట్లాది మందిని ప్రభావితం చేస్తూ వస్తున్న యోధుడు సర్దార్ షహీద్ భగత్ సింగ్(Bhagat Singh Tribute). సెప్టెంబర్ 27న ఆ విప్లవ యోధుడి 115వ జయంతి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని జాతీయ పార్టీలు, ప్రధాన మంత్రి మోదీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితర ప్రముఖులంతా నివాళులు అర్పించారు. ఆయన చేసిన బలిదానం ఎల్లప్పటికీ స్పూర్తి దాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అరుదైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ది బాంబే క్రానికల్ లో ప్రచురించిన వ్యాసంలో దేశ మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ భగత్ సింగ్ గురించి రాసిన వ్యాక్యాలను మరోసారి తెలియ చేసింది.
భగత్ సింగ్ తన చివరి రోజులలో జవహర్ లాల్ నెహ్రూ తన నిశ్శబ్దం వెనుక గల కారణాన్ని వెల్లడించారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్.
భగత్ సింగ్ సిద్దాంతాలను తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు ఆయన వారసత్వాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించారు.
తమ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భగత్ సింగ్(Bhagat Singh) స్పూర్తి అని పేర్కొన్నారు. దేశాన్ని ప్రభావితం చేసిన అత్యంత ప్రియమైన వారంతా ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందన్నారు.
జాతి గర్వించిన దేశ భక్తుడు షహీద్ భగత్ సింగ్ అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
Also Read : పీఎఫ్ఐ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్