Vikas Walker : ఆప్తాబ్ పూనావాలాను ఉరి తీయండి

శ‌ద్దా వాక‌ర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

Vikas Walker : దేశ వ్యాప్తంగా సంచ‌లనం క‌లిగించింది శ్ర‌ద్దా వాక‌ర్ దారుణ హ‌త్య‌. ఆమెను దారుణంగా హ‌త్య చేయ‌డ‌మే కాకుడా ముక్క‌లు ముక్కులుగా చేసి పార‌వేశాడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా. శుక్ర‌వారం బాధితురాలు శ్ర‌ద్దా వాక‌ర్ తండ్రి వాక‌ర్ మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు ల‌భించే స్వేచ్ఛ గురించి ఆయ‌న ప్ర‌శ్నించారు.

దీనిపై మ‌రింత ఆలోచించాల‌ని అన్నారు. ఇబ్బందులు సృష్టిస్తున్న కొన్ని మొబైల్ అప్లికేష‌న్ ల‌పై చ‌ర్య తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు వికాస్ వాక‌ర్. స‌రైన విచార‌ణ జ‌రిపి వెంట‌నే ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాను ఉరి తీయాల‌ని అన్నారు. ఆఫ్తాబ్ , అత‌డి కుటుంబ స‌భ్యులు, ఈ దారుణ హ‌త్య‌లో ప్ర‌మేయం ఉన్న ఇత‌రుల‌పై కూడా విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు.

అంతే కాకుండా వికాస్ వాక‌ర్ కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. ప‌ద్దెనిమిది నెల‌లు నిండిన పిల్ల‌ల‌పై కౌన్సెలింగ్ , నియంత్ర‌ణ ఉండాల‌న్నారు. ఇంటి నుండి బ‌య‌లుదేరే ముందు నేను శ‌ద్దా వాక‌ర్ తో మాట్లాడాన‌ని అన్నారు. అత‌డితో ఉండ‌వ‌ద్ద‌ని సూచించారు.

మొబైల్ డేటింగ్ అప్లికేష‌న్ బంబుల్ ద్వారా ముంబైలో ఆఫ్తాబ్ ను క‌లిశారు శ్ర‌ద్దా వాక‌ర్. ద‌ర్యాప్తులో సాయం చేసేందుకు ఆఫ్తాబ్ ఖాతా నుండి వివ‌రాలు కోరుతూ పోలీసులు బంబుల్ కు లేఖ రాశారు. ఈ విష‌యంలో ముంబై పోలీసుల నిర్లక్ష్యం ఉంద‌ని ఆరోపించారు వికాస్ వాక‌ర్(Vikas Walker).

ఆప్తాన్ అమీన్ పూనావాలా హింసాత్మ‌క ప్ర‌వ‌ర్త‌న గురించి అత‌డి కుటుంబానికి తెలుసని ఆరోపించారు వికాస్ వాక‌ర్. ఈ విష‌యం గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేకుండా పోయింద‌న్నారు.

Also Read : ఎన్‌జేఏసీపై ప్ర‌తిపాద‌న‌లు ఏవీ లేవు

Leave A Reply

Your Email Id will not be published!