Hang The Killer : శ్రద్దా హంతకుడిని ఉరి తీయండి – లాయర్లు
ఢిల్లీ కోర్టులో తీవ్ర గందరగోళం
Hang The Killer : శ్రద్దాను దారుణంగా హత్య చేసి భాగాలను విసిరేసిన ఘటనలో నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలపై లాయర్లు నిప్పులు చెరిగారు. ఈ హంతకుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రాంగణం నినాదాలతో దద్దరిల్లి పోయింది. ఈ సమాజం, దేశం ఎటుపోతోందో అర్థం కావడం లేదన్నారు.
మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శద్దా హంతకుడికి వ్యతిరేకంగా లాయర్లు కేకలు వేశారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు ఆఫ్తాబ్ పూనా వాలాను పోలీసు కస్టడీని ఐదు రోజుల పాటు పొడిగించింది.
నిందితుడికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా విచారణ జరుగుతున్న సమయంలో సాకేత్ కోర్టులోని గది వెలుపల దాదాపు 100 మందికి పైగా న్యాయవాదులు గుమిగూడారు. శ్రద్దా వాకర్ ను దారుణంగా హత్య చేసిన ఆప్తాబ్ పూనా వాలాకు మరణశిక్ష(Hang The Killer) విధించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన దరఖాస్తులను స్వీకరించేందుకు న్యాయమూర్తి అంగీకరిచడంతో లాయర్లు శ్రద్దా హంతుకుడు బతికి ఉండడానికి వీలు లేదంటూ నినాదాలు చేశారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అవిరల్ శుక్లా ముందు హాజరు పరిచారు.
ఈ విషయం తెలుసుకున్న న్యాయవాదులు అక్కడికి వచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే విచారణ చేపట్టాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. హంతకుడికి శిక్ష వేయాలని కోరారు.
మరో వైపు ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కేశల్ కిషోర్ పై మండిపడ్డారు.
Also Read : కౌశల్ కిషోర్ కామెంట్స్ పై కన్నెర్ర