Hanuman Beniwal : ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా – బేనివాల్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
Hanuman Beniwal : ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ బేనివాల్ నిప్పులు చెరిగారు. మణిపూర్ లో చోటు చేసుకున్న హింసపై ప్రశ్నించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజ్యసభలో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్బంగా హనుమాన్ బేనివాల్(Hanuman Beniwal) మీడియాతో మాట్లాడారు.
Hanuman Beniwal Said
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ఎంపీలు ప్రశ్నిస్తారని, దానికి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కొలువు తీరిన ప్రభుత్వంపై ఉందన్నారు. ఇవాళ దేశంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు బేనివాల్. బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఎంపీ సంజయ్ సింగ్ పై వేటు వేసిన చైర్మన్ వెంటనే తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు హనుమాన్ బేనివాల్. ఎంపీని సస్పెండ్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని పాతర వేయడం తప్ప మరొకటి కాదన్నారు. అసలు మణిపూర్ లో చోటు చేసుకున్న పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , అమిత్ షా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎల్పీ ఎంపీ.
Also Read : Sanjay Raut : మోదీ సర్కార్ పై రౌత్ కన్నెర్ర