Hardik Patel Joins : కాంగ్రెస్ కు షాక్ బీజేపీలో చేరిన పటేల్
సామాన్య సైనికుడిగా పని చేస్తా
Hardik Patel Joins : మోదీ సారథ్యంలో తాను ఓ సామాన్య సైనికుడిగా పని చేస్తానంటూ ట్వీట్ చేసిన గుజరాత్ పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
మూడేళ్ల పాటు ఆ పార్టీలో పని చేశారు. కానీ తీవ్ర అసంతృప్తితో ఉన్న హార్దిక్ పటేల్ ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. గురువారం గుజరాత్ లోని గాంధీనగర్ లో భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఎన్నికలకు నెల రోజుల ముందు ఆ పార్టీలో చేరడం విశేషం. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సీఆర్ పాటిల్(Hardik Patel Joins) సమక్షంలో చేరారు. తాను సమర్థవంతంగా పని చేసేందుకు బీజేపీలో చేరానని చెప్పారు.
ఇవాల్టి నుంచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు హార్దిక్ పటేల్. తాను ఎవరి ముందు ఏ పదవిని ఆశించ లేదన్నారు. అంతే కాదు తాను పదవి కావాలంటూ ఎవరినీ దేబరించ లేదని చెప్పారు.
తాను తన కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని తెలిపారు. కేవలం రాష్ట్ర ప్రజల కోసం పని చేసేందుకు తాను బీజేపీలో చేరడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో మూడేళ్ల పాటు పని చేయడం వల్ల చాలా కోల్పోయానని, ఒక రకంగా తన రాజకీయ జీవితానికి ఇది పెద్ద దెబ్బగా ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాలలో ముందుకు సాగుతోందన్నారు.
ఆయన యావత్ ప్రపంచానికి గర్వ కారణంగా నిలిచారని కొనియాడారు హార్దిక్ పటేల్(Hardik Patel Joins). ఇదిలా ఉండగా పాటిదార్ కమ్యూనిటీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తోంది. ఈ తరుణంలో ఆ కమ్యూనిటీకి పటేల్ పెద్ద దిక్కుగా ఉన్నారు.
Also Read : అమిత్ షాతో అజిత్ దోవల్ అత్యవసర భేటీ