Hardik Patel : బీజేపీలో చేరనున్న పటేల్
రెండు నెలలుగా పార్టీతో టచ్
Hardik Patel : పాటిదార్ కమ్యూనిటీలో బలమైన నాయకుడిగా పేరొందిన హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఆ పార్టీలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
తనకు అవమానం జరిగిందని, పార్టీ హైకమాండ్ కూడా పట్టించు కోలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీని హార్దిక్ పటేల్(Hardik Patel) వ్యక్తిగతంగా దాడికి దిగారు. పటేల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
కాంగ్రెస్ పార్టీని వీడిన పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మూడేళ్ల విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానని వాపోయాడు. ఇదే సమయంలో పటేల్ గత రెండు నెలల నుంచి భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని సమాచారం.
దాంతో పటేల్ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు టాక్. 2019లో కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ఆయన ప్రారంభించారు.
గుజరాత్ లో పాటిదార్ వర్గానికి పేరొందిన నాయకుడు. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖ రాసిన తర్వాత ఈనెల 18న పార్టీని వీడారు. ఆయన ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
అగ్ర నాయకులు వారి మొబైల్ ఫోన్లలో ఎంజాయ్ చేస్తూ , ప్రజా సమస్యలను పట్టించు కోవడం మానేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రధానంగా గుజరాత్ కాంగ్రెస్ నాయకులు వారికి చికెన్ శాండ్ విచ్ లను ఏర్పాటు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు హార్దిక్ పటేల్(Hardik Patel).
Also Read : దేశంలో మా జెండా ఎగరడం ఖాయం