Hardik Patel Modi : మోదీ సార‌థ్యంలో సాధార‌ణ సైనికుడిని

భార‌తీయ జ‌నతా పార్టీ ఎంట్రీకి ప‌టేల్ సై

Hardik Patel Modi : గుజ‌రాత్ రాష్ట్రంలో అత్య‌ధిక ప్ర‌భావితం చేసే పాటిదార్ క‌మ్యూనిటీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హార్దిక్ పటేల్ భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు రంగం సిద్ద‌మైంది.

ఈ మేర‌కు ఆయ‌న గురువారం చేసిన ట్వీట్ క‌ల‌కం రేపింది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ గా ఎదిగారు. మూడేళ్ల పాటు ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

ఆ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప‌ని చేశారు. కానీ రాష్ట్ర నాయ‌కుల‌తో పాటు హైక‌మాండ్ త‌నను పట్టించు కోలేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ త‌రుణంలో హార్దిక్ ప‌టేల్(Hardik Patel Modi) ఆమ్ ఆద్మీ పార్టీలో లేదా బీజేపీలో చేరుతారంటూ ప్ర‌చారం జ‌రిగింది.

ఆయ‌న ఇవాల్టి వ‌ర‌కు కొట్టి పారేస్తూ వ‌చ్చారు. కానీ ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న ట్వీట్ చేశారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పారు.

అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుడిగా పేరొందిన దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో తాను ఓ సాధార‌ణ సైనికుడిని మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

హార్దిక్ ప‌టేల్ చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. దీంతో ప‌టేల్ చేసిన ట్వీట్ బీజేపీ ఎంట్రీని పూర్తిగా అధికారం చేసింది. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీలో మూడేళ్ల పాటు వృధా చేసుకున్నాన‌ని ప‌టేల్ వాపోయారు.

ఆయ‌న బీజేపీలో చేరేందుకు కొన్ని గంట‌ల ముందు తాను కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

నేను జాతీయ ఆస‌క్తి, ప్రాంతీయ ఆస‌క్తి, సామాజిక ఆస‌క్తి భావాల‌తో నూత‌న అధ్యాయాన్ని ప్రారంభించ‌బోతున్నా. మోదీ(Hardik Patel Modi) నేతృత్వంలో దేశ సేవ‌లో చిన్న సైనికుడిగా ప‌ని చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు హార్దిక్ ప‌టేల్.

Also Read : జైన్ భ‌క్తుడు త‌ప్పు చేయ‌డు – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!