Hari Rama Jogaiah: ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ !

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ !

Hari Rama Jogaiah: మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖ రాసారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ హరి రామ జోగయ్య(Hari Rama Jogaiah) లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారన్నారు. కాపులకు రిజర్వేషన్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని తెలిపారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు సంక్షేమ సేన అనేక ఉద్యమాలు చేసిందని హరిరామ జోగయ్య తెలిపారు.

Hari Rama Jogaiah Letter

ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర న్యాయస్థానంలో పిటిషన్ సైతం వేసిందన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి వైసీపీ ప్రభుత్వం విముఖత తెలుపుతూ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త ఆఫిడివిట్ దాఖలు చేయాలని కోరుతున్నామని హరిరామ జోగయ్య తెలిపారు. త్వరలో కాపు రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

Also Read : YS Sharmila: జంతర్ మంతర్ ధర్నాపై వైఎస్ జగన్ పై షర్మిల ఫైర్ !

Leave A Reply

Your Email Id will not be published!