Harish Rao : హైదరాబాద్ – అధికార పార్టీ బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. రైతు బంధు పథకం కింద పంపిణీకి సంబంధించి 2 రోజుల కిందట ఇచ్చిన అనుమతిని తాము ఉప సంహరించు కుంటున్నట్లు స్పష్టం చేసింది ఈసీ.
Harish Rao Comment Viral
ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది. రైతు బంధు నిధుల విడుదలను వెంటనే నిలిపి వేయాలని రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ ఈ నిధులపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. రైతుల ఖాతాల్లో జమ చేస్తే తమకు ఓట్లు పడతాయని ఆశించింది.
ఇదిలా ఉండగా నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. అంతకు ముందు రైతు బంధు కింద నిధులు విడుదల చేయకుండా కేవలం ఎన్నికలు జరిగే రెండు రోజుల ముందు ఎలా జమ చేస్తారంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రశ్నించాయి.
అంతే కాకుండా ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి హరీశ్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు సైతం రైతు బంధు గురించి పదే పదే ప్రస్తావించారు. ఈనెల 28న రైతు బంధు కింద
నిధులు జమ చేస్తామంటూ ఆర్థిక మంత్రి హోదాలో ప్రకటించడం పూర్తిగా ఓటర్లను ప్రభావితం చేయడమేనని పేర్కొన్నాయి విపక్షాలు.
Also Read : Revanth Reddy : కాంగ్రెస్ రాగానే ఖాతాల్లో వేస్తాం