Harish Rao : హైదరాబాద్ – మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎగిరే జెండా ఒక్కటేనని ఆ జెండా గులాబీ మాత్రమేనని స్పష్టం చేశారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao). ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మల్కాజ్ గిరి లో జరిగిన సభలో ప్రసంగించారు.
Harish Rao Comment
మైనంపల్లికి పార్టీ ఎంతో సహకరించిందని, ఆయన కోరిన కోర్కెలన్నీ తీర్చిందన్నారు. కానీ కేవలం పదవి మీద ఆశతో పక్క పార్టీలోకి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే పలు పార్టీలు మారిన మైనంపల్లి హన్ముంత రావును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
ఆయనకు తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్దమై ఉన్నారని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ బలుపును చూసి వాపు అనుకుంటున్నారని , కానీ రేపటి ఎన్నికల రోజు గంప గుత్తగా ఓట్లు మాత్రం బీఆర్ఎస్ కే వేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇక్కడ బరిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గెలుపు తథ్యమని అన్నారు.
మైనంపల్లి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడని, ఆయన లాగా తాను దిగజారి మాట్లాడ లేనంటూ పేర్కొన్నారు.
Also Read : Revanth Reddy : కల్వకుంట్ల కాలకేయులు జైలుకే