Harish Rao : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, దివంగత మంత్రి పీజేఆర్ తనయుడు విష్ణు వర్దన్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. తను జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించారు. పార్టీ టికెట్ ఇస్తుందని అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి విష్ణు ఆశలపై నీళ్లు చల్లింది ఆ పార్టీ. ఆ సీటును ఏకంగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజాహరుద్దీన్ కు కేటాయించింది.
Harish Rao Meet Vishnu Vardhan Reddy
దీంతో విష్ణు వర్దన్ రెడ్డి అనుచరులు రెచ్చి పోయారు. గాంధీ భవన్ కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను చించేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్దన్ రెడ్డి. అజారుద్దీన్ పై విరుచుకు పడ్డారు. ఆయనకు ఈ నియోజకవర్గంతో ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించారు. తీరా ఎంత అరిచినా పార్టీ నుంచి స్పందన రాలేదు.
పార్టీ హైకమాండ్, ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో విష్ణు వర్దన్ రెడ్డికి టికెట్ కేటాయించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. దీంతో విష్ణు వర్దన్ రెడ్డి(Harish Rao) పార్టీని వీడేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు.
సోమవారం ఏకంగా విష్ణు ఇంటికి ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెళ్లారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. పార్టీ తనకు సముచిత స్థానం ఇస్తుందని హామీ ఇచ్చారు.
Also Read : Komatireddy Venkat Reddy : డీకేకు అంత సీన్ లేదు