Harish Rao : అభివృద్ధి వైపు జ‌నం చూపు

ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు

Harish Rao : తెలంగాణ – అభివృద్ది వైపు జ‌నం చూస్తున్నార‌ని దీని ప్ర‌కారం చూస్తే భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ఆర్థిక‌, ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు. గురువారం ఆయ‌న త‌న భార్య‌తో క‌లిసి ఓటు వేశారు. అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు.

Harish Rao Comment

దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌ని పేర్కొన్నారు. రాష్ట్ర‌మంతటా ప్ర‌తి చోటా వేలాదిగా త‌ర‌లి వ‌స్తున్నార‌ని , గులాబీకే ఓటు వేశార‌ని ఇక డిసెంబ‌ర్ 9న మ‌రోసారి ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికే ఏర్పాట్ల‌లో తాము ఉన్నామ‌ని, కాంగ్రెస్ పార్టీ బ‌లుపు చూసుకుని వాపు అనుకుంటోంద‌న్నారు. ఆ పార్టీ క‌ల‌ల్లో తేలి యాడుతోంద‌న్నారు. అవ‌న్నీ నిజం కావ‌న్నారు మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు(Harish Rao). సెల‌వు డే అని ఇళ్ల‌ల్లో ఉంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తి ఒక్క‌రు బ‌య‌ట‌కు వ‌చ్చి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు.

ఓటు అన్న‌ది అత్యంత విలువైన‌ద‌ని , దీనిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా 119 నియోకవ‌ర్గాల‌కు గాను పోలింగ్ కొన‌సాగుతోంది. గ‌ట్టి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన‌ట్లు డిజీపీ అంజ‌నీ కుమార్ వెల్ల‌డించారు.

Also Read : Revanth Reddy : డ్యాం స‌మ‌స్య చిన్న‌ది – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!