Harish Rao : రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 119 సీట్లకు గాను 100 సీట్లు తప్పకుండా గెలుస్తామని స్పష్టం చేశారు.
Harish Rao Comment
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ పాలనను చూసి ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని, మానుకుంటే మంచిదని సూచించారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వాళ్లు తమను అనే హక్కు లేదన్నారు హరీశ్ రావు(Harish Rao). రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , దళిత బంధు, బీసీ బంధు ప్రవేశ పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఐటీ పరంగా లక్షకు పైగా జాబ్స్ ను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఎక్కడా లేని రీతిలో ఇక్కడ పోస్టులను నియమించినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలు నిరాధారమని ఆరోపించారు హరీశ్ రావు.
Also Read : Revanth Reddy : మోసానికి చిరునామా కేసీఆర్ పాలన