Harish Rao : నారాయణఖేడ్ – రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ఈనెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.
Harish Rao Slams Revanth Reddy
కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు హరీశ్ రావు(Harish Rao). తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకి ఎక్కు పెట్టినోడికి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
పదవుల కోసం కుర్చీలు మారే రేవంత్ రెడ్డిని ఎవరూ పట్టించు కోరన్నారు. మొదట టీఆర్ఎస్ లో చేరిండి. ఆ తర్వాత టీడీపీలో, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నడు. రేపొద్దున ఓటమి పొందడం ఖాయం. ఏ పార్టీలో చేరతాడో వాళ్లకే తెలియదన్నారు హరీశ్ రావు.
ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు. ఇప్పుడు ఆమెను దేవత అంటూ పొగుడుతున్నాడని , పదవుల కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడే రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించడం ఖాయమన్నారు మంత్రి.
Also Read : CM KCR Tour : కేసీఆర్ టూర్ షెడ్యూల్ లో మార్పు