Harish Rao : తెలంగాణ కోసం త్యాగం చేసినం
పదవులు కోసం ఏనాడూ పాకులడ లేదు
Harish Rao : హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శాసన సభను తప్పు దోవ పట్టించేలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. చరిత్ర తెలుసు కోకుండా తమపై విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
Harish Rao Comments Viral
ఆనాటి నుంచి నేటి దాకా కేవలం తెలంగాణ కోసం మాత్రమే తాము పని చేస్తూ వచ్చామని స్పష్టం చేశారు తన్నీరు హరీశ్ రావు(Harish Rao). పదవులను త్యజించిన చరిత్ర తమకు ఉందన్నారు. ఏనాడూ పదవుల కోసం పాకులాడ లేదని పేర్కొన్నారు. వాస్తవాలు ఏమిటి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు మాజీ మంత్రి.
తనకు కాంగ్రెస్ పార్టీ పదవి ఇచ్చిందని, తాను కావాలని కోరలేదని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. పోతిరెడ్డిపాడు కోసం తమ పార్టీకి చెందిన దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి మాత్రమే పోరాడడని చెప్పడం భావ్యం కాదన్నారు.
ఆనాడు ఆరుగురు మంత్రులుగా ఉన్నామని , 14 నెలలకే తమ పదవులకు రాజీనామా చేయడం జరిగిందని చెప్పారు హరీశ్ రావు. తెలంగాణకు నీళ్లు ఇవ్వక పోవడం, 610 జీవో కు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయం సీఎంకు తెలియక పోవడం దారుణమన్నారు.
Also Read : KTR Slams : గవర్నర్ కామెంట్స్ కేటీఆర్ సీరియస్