Harish Rao : తెలంగాణలో ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరుకుంది. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. 28 వరకు మాత్రమే ఏ పార్టీ అయినా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరు బయటకు వచ్చినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా నేతల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు తెర లేపారు. ఈ తరుణంలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) రెచ్చి పోయారు.
Harish Rao Slams Congress
తెలంగాణ కాంగ్రెస్ ఇస్తే రాలేదని, కేవలం తాము పోరాటం చేయడం వల్ల వచ్చిందన్నారు. ఆనాడు కేసీఆర్ గనుక ఒకే ఒక్కడు బయలు దేరి ఉద్యమించక పోయి ఉంటే ఈనాడు తెలంగాణ వచ్చేదా అని ఆలోచించాలని అన్నారు.
ఇవాళ మాట్లాడుతున్న ప్రతిపక్షాల నేతలు ఆరోజు ఎక్కడ ఉన్నారో ఒక్కసారి ఆలోచించు కోవాలని అన్నారు. మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలతో ముందుకు వస్తోందన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ సర్కార్ పని చేస్తోందని చెప్పారు. నిరుద్యోగులు సైతం తమ వైపు ఉన్నారని కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ లేదన్నారు హరీశ్ రావు.
Also Read : Minister KTR : మెట్రోలో కేటీఆర్ హల్ చల్