Harish Rao Slams : రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర
మంత్రి తన్నీరు హరీశ్ రావు
Harish Rao Slams : హైదరాబాద్ – ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర ఏమిటో బయట పడిందని ఆరోపించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చి ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి. నిరంజన్ లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో రైతు బంధు ఆపిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Harish Rao Slams Congress
రైతులకు పంట సాయం పంపిణీ చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా నిలిపి వేయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు తన్నీరు హరీశ్ రావు(Harish Rao). టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ రైతు బంధుపై ఫిర్యాదు వల్లనే ఆగిందన్నారు.
రైతు బంధును కాంగ్రెస్ పార్టీనే ఆపిందని అనడానికి ఇదే నిదర్శనమన్నారు. రైతులారా, తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు తన్నీరు హరీశ్ రావు. ఇదిలా ఉండగా ఈనెల 25న ఈసీ రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఈనెల 27న సోమవారం హరీశ్ రావు చేసిన కామెంట్స్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడాన్ని తప్పు పట్టింది కాంగ్రెస్ పార్టీ.
ఇదిలా ఉండగా ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాము రైతుల సాయాన్ని అడ్డు కోలేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ ప్రశ్నించినట్లు తెలిపారు.
Also Read : G kishan Reddy : రెండు చోట్ల సీఎం పరాజయం పక్కా