Haryana CM Boycott : హర్యానా సీఎం ఖట్టర్ ఘెరావ్
మహేందర్ గఢ్ గ్రామస్థుల నిరసన
Haryana CM Boycott : హర్యానా బీజేపీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు ఘోర అవమానం జరిగింది. మహేందర్ గఢ్ జిల్లా లోని సిహామా గ్రామాన్ని ఉప తహసిల్ గా ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు గ్రామస్థులు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఖట్టర్. సీఎం ఇల్లును ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో వివరణ ఇచ్చేందుకు వచ్చిన ఎమ్మెల్యే సీతారాం యాదవ్ ను అడ్డుకున్నారు.
ఇందుకు సంబంధించి బహిరంగ చర్చ చేపట్టారు. ఇది వివాదానికి దారి తీసింది. సిహామా గ్రామాన్ని ఉప తహసీల్ హోదాను ప్రకటించారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఈ విషయం తెలిసిన వెంటనే దొర్డా అహిర్ గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పైకి వచ్చారు. తమ గ్రామం దోగ్దా అహిర్ సిహామా కంటే పెద్దదని, దానిని కూడా ఉప తహసీల్ గా చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామస్థులు సీఎంను ఘెరావ్ చేశారు. ఆయనను ఒప్పించేందుకు ఎమ్మెల్యే వచ్చినా పట్టించు కోలేదు. ఆయనను ప్రతిఘటించారు. దీంతో చేసేది ఏమీ లేక వెళ్లి పోయారు. విషయం తెలుసుకున్న సీఎం గ్రామస్థులను చర్చకు ఆహ్వానించారు. అధికారుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు మనోహర్ లాల్ ఖట్టర్. ఏ గ్రామం సరైనదో అదే ఉప తహసీల్ గా ప్రకటిస్తామని తెలిపారు. దీంతో గ్రామస్థులు శాంతించారు.
Also Read : Jagadish Shettar