Haryana CM : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Haryana CM ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తనకు సంబంధించిన కార్లకు వీఐపీ నంబర్లు ఉపయోగించనని ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు.
ఇక తన కాన్వాయ్ లోని 4 వాహనాలకు వీఐపీ నంబర్లను ఉపసంహరించు కుంటున్నానని పేర్కొన్నారు. వాటిని సాధారణ ప్రజలకు అందు బాటులోకి తీసుకు వస్తామని వెల్లడించారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న హర్యానా మోటార్ వెహికల్స్ రూల్స్ -1993 లో సవరణ చేస్తున్నట్లు తెలిపారు ఖట్టర్. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 179 వాహనాలకు కేటాయించిన వీఐపీ నంబర్లను వేలం పాట పెడతామని ప్రకటించారు.
ఇందు వల్ల వీఐపీల నంబర్లు కూడా సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది అత్యంత మేలు చేస్తుందని తెలిపారు.
ఈ వేలం పాట నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 18 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని చెప్పారు. మరో వైపు చండీగఢ్ రాజధానిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం హర్యానా వర్సెస్ పంజాబ్ రాష్ట్రాల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. చండీగఢ్ పై పూర్తి సర్వాధికారాలు తమ రాష్ట్రానికే ఉంటాయని స్పష్టం చేశారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.
ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ హర్యానా సైతం తీర్మానం చేయడం విశేషం. ఇరు రాష్ట్రాల మధ్య చండీగఢ్ చర్చనీయాంశంగా మారింది.
Also Read : దారుణంగా అవమానించారు – పాశ్వాన్