Sandeep Singh : సీఎంకు పోర్ట్ ఫోలియో అప్ప‌గింత

కేసు విచార‌ణ‌కు సిద్ద‌మ‌న్న సింగ్

Sandeep Singh : జూనియ‌ర్ అథ్లెటిక్స్ కోచ్ పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హ‌ర్యానా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి , మాజీ హాకీ జ‌ట్టు కెప్టెన్ సందీప్ సింగ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం త‌న కీల‌క క్రీడా శాఖను సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ కు అప్ప‌గించారు.

ఈ సంద‌ర్భంగా సందీప్ సింగ్(Sandeep Singh) మీడియాతో మాట్లాడారు. తాను ఏ విచార‌ణ‌కైనా సిద్ద‌మేన‌ని అందుకే నైతిక బాధ్య‌త వ‌హిస్తూ ముందుగానే త‌న ప‌దవి నుంచి త‌ప్పుకున్నాన‌ని చెప్పారు. రాష్ట్రం కానీ లేదా కేంద్రం కానీ ఏ విచార‌ణ‌ను ఎదుర్కొనేందుకైనా తాను రెడీగా ఉన్నాన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు సందీప్ సింగ్. విచార‌ణ పూర్త‌య్యేంత వ‌ర‌కు తాను ఎక్క‌డికీ వెళ్ల‌న‌ని ఇక్క‌డే ఉంటాన‌ని పేర్కొన్నారు.

అయితే కొంద‌రు కావాల‌ని త‌న‌ను దూషించేందుకు య‌త్నిస్తున్నార‌ని, విచార‌ణ త‌ర్వాత ఎవ‌రు దోషో తేలుతుంద‌ని అంత వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల‌ని సూచించారు సందీప్ సింగ్. ఇదిలా ఉండ‌గా సందీప్ సింగ్ ప్ర‌స్తుతం రాష్ట్రానికి సంబంధించి రాజీనామా చేయ‌క ముందు క్రీడా శాఖ‌తో పాటు ప్రింటింగ్, స్టేష‌న‌రీ మంత్రిత్వ శాఖ‌ల‌ను క‌లిగి ఉన్నారు.

దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. నా ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని మీకంద‌రికీ తెలుస‌న్నారు.

కురుక్షేత్ర లోని పెహూవా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి 2019 ఎన్నిక‌ల్లో సందీప్ సింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. చండీగ‌ఢ్ లోని త‌న అధికారిక నివాసంలో త‌న‌ను వేధించాడంటూ మ‌హిళా కోచ్ ఆరోపించింది.

Also Read : నోట్ల ర‌ద్దుపై మోడీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

Leave A Reply

Your Email Id will not be published!