Sandeep Singh Booked : మంత్రిపై లైంగిక వేధింపుల కేసు

కొత్త సంవ‌త్స‌రంలో కోలుకోలేని బిగ్ షాక్

Sandeep Singh Booked : హ‌ర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ కు(Sandeep Singh) కొత్త ఏడాదిలో కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇదే ప్రాంతానికి చెందిన మ‌హిళా జూనియ‌ర్ అథ్లెటిక్స్ కోచ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. చండీగ‌ఢ్ లోని త‌న అధికారిక నివాసానికి వెళ్లిన త‌న‌ను మంత్రి సందీప్ సింగ్ కు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు.

ఈ మేర‌కు క్రీడా శాఖ మంత్రిపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే సందీప్ సింగ్ ఈ ఆరోప‌ణ‌ల్ని కొట్టి పారేశారు. కావాల‌ని త‌నను బ‌ద్నాం చేసేందుకు ఇలా చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌పై వ‌చ్చిన ఈ విమ‌ర్శ‌ల‌ను తాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు సందీప్ సింగ్.

పూర్తిగా వీటిని తోసిపుచ్చుతున్నాన‌ని, ఎలాంటి విచార‌ణ ఎదుర్కొనేందుకైనా తాను రెడీగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప‌రంగా కానీ లేదా కేంద్ర ప‌రంగా కానీ ఎవ‌రిని నియ‌మించినా తాను విచార‌ణ‌కు సిద్ద‌మై ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి సందీప్ సింగ్. హ‌ర్యానాకు చెందిన మ‌హిళా జూనియ‌ర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదును స్వీక‌రించారు చండీగ‌ఢ్ పోలీసులు.

ఈ మేర‌కు హ‌ర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్(Sandeep Singh) పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. సెక్ష‌న్ లు 354, 354ఎ (లైంగిక వేధింపు) , 354 బి (వ‌స్త్రం విప్పే ఉద్దేశంతో మ‌హిళ‌పై దాడి చేయ‌డం లేదా నేర పూరిత బ‌ల‌వంతం ఉప‌యోగించ‌డం , 342 (త‌ప్పుగా నిర్బంధించ‌డం) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.

Also Read : అమృత ఫ‌డ్న‌వీస్ పై నితీశ్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!