Haryana Stops : ద‌గ్గు సిర‌ప్ ల ఉత్ప‌త్తి నిలిపివేత‌

ఆదేశాలు జారీ చేసిన హ‌ర్యానా

Haryana Stops : గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి ప్ర‌ధాన కార‌ణంగా భావిస్తున్న హ‌ర్యానాకు చెందిన ప్ర‌ముఖ మందుల త‌యారీ కంపెనీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. నాలుగు ద‌గ్గు సిర‌ప్ ల‌ను ఉత్ప‌త్తి చేయుండా స‌ర్కార్ నిషేధం విధించింది. ఈ మేర‌కు కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

కంపెనీకి సంబంధించిన సందేహాస్ప‌ద‌మైన ఔష‌ధాల‌ను త‌యారు చేసేందుకు, ప‌రీక్షించేందుకు ఉప‌యోగించే ప‌రిక‌రాలు , సాధనాల లాగ్ బుక్ ను త‌యారు చేయ‌లేక పోయిన‌ట్లు గుర్తించింది. ఇదిలా ఉండ‌గా పిల్ల‌ల మృతికి ఈ ద‌గ్గు మందులే కార‌ణ‌మ‌ని భావిస్తోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలియ చేస్తూ భార‌త ప్ర‌భుత్వానికి విన్న‌వించింది.

దీంతో ప్ర‌భుత్వం ఈ మొత్తం వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని స‌ద‌రు సంస్థ‌పై హ‌ర్యానా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎలాంటి ఉత్ప‌త్తులు త‌యారు చేయకుండా నిషేధం విధించింది హ‌ర్యానా స‌ర్కార్(Haryana Stops) . ఆరోగ్య సంస్థ సూచ‌న మేర‌కు భార‌త దేశం వెంట‌నే
ద‌గ్గు సిర‌ప్ ల న‌మూనాల‌ను ప‌రీక్ష కోసం పంపింది.

వారం రోజుల కింద‌ట ఇందుకు సంబంధించి నివేదించింది. హ‌ర్యానా ఆధారిత సిర‌ప్ ల త‌యారీదారు మైడెన్ ఫార్మాస్యూటిక‌ల్స్ త‌యారీలో పెద్ద ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్న‌ట్లు ఆరోపణ‌లున్నాయి. వీటి న‌మూనాల‌ను కోల్ క‌తా లోని సెంట్ర‌ల్ డ్ర‌గ్ ల్యాబ్ కు పంపారు. ఇందుకు సంబంధించిన నివేదిక‌లు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

నివేదిక‌లు అందాక చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్. కాగా కేంద్ర‌, రాష్ట్ర ఔష‌ధ విభాగాల సంయుక్త త‌నిఖీల్లో త‌యారీలో దాదాపు 12 లోపాలు గుర్తించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మొత్తం ఉత్ప‌త్తిని నిలిపి వేయాల‌ని ఆదేశించింది ప్ర‌భుత్వం.

Also Read : విప‌రీత విధానాలు ప్ర‌మాద‌క‌రం

Leave A Reply

Your Email Id will not be published!