Mayawati : ద్వేషం..మ‌తం దేశానికి ప్ర‌మాదం – మాయావ‌తి

ప్ర‌భ‌త్వాలు వివాదాల‌కు దూరంగా ఉండాలి

Mayawati : ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావ‌డం లేద‌న్నారు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్‌, యూపీ మాజీ సీఎం కుమారి మాయావ‌తి(Mayawati). బుధ‌వారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

కేంద్రం అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేస్తోంది. ప్ర‌ధానంగా మాన్యశ్రీ కాన్షీరాం చెప్పిన‌ట్లు మ‌నీ, మీడియా, మాఫియా ఆధిప‌త్యం చెలాయిస్తోంది. కొన్ని సంస్థలు వ్య‌క్తుల్ని టార్గెట్ గా చేసుకుని బ‌ద్నాం చేస్తున్నాయి.

ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. వార్త‌ల‌ను ప్ర‌సారం చేసే స‌మ‌యంలో కానీ లేదా ప్ర‌చురించే స‌మ‌యంలో కానీ ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోవాల‌ని సూచించారు. ఇలా చేయ‌క పోవ‌డం వ‌ల్లే ఇబ్బందులు త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్నారు.

అంతే కాకుండా ఫేక్ న్యూస్ ఈ మ‌ధ్య ఎక్కువై పోయింద‌ని, ద్వేష పూరిత ప్ర‌సంగాలు రాజ్య‌మేలుతున్నాయ‌ని ఆరోపించారు మాయావ‌తి(Mayawati). వీటిపై వేగ‌వంత‌మైన పోలీస్ చ‌ర్య తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా ఇది చాప కింద నీరులా పారింద‌న్నారు. ఇదంతా మ‌తాన్ని ఆధారం చేసుకుని రాజ‌కీయాలు చేస్తున్న వాళ్ల‌కు ఆట‌గా మారింద‌ని ఆరోపించారు.

దీని వ‌ల్ల ప్ర‌జ‌లు కొట్టుకు చ‌స్తున్నార‌ని దీనికి ఎవ‌రు బాధ్య‌త వ‌హించాల‌ని ప్ర‌శ్నించారు. జీటీవికి చెందిన జ‌ర్న‌లిస్ట్ రోహిత్ రంజ‌న్ ను అరెస్ట్ చేసేందుకు అటు చ‌త్తీస్ గ‌ఢ్ పోలీసులు ఇటు యూపీ లోని ఘ‌జియాబాద్ పోలీసులు కొట్లాడు కోవ‌డం దారుణంగా ఉంద‌న్నారు.

ఇది కాదు ప్ర‌జాస్వామ్యం అని పేర్కొన్నారు మాయావ‌తి. ఇలాంటి విచార‌క‌ర‌మైన ప‌రిణామాల వ‌ల్ల న్యాయ వ్య‌వ‌స్థ ధ్వంస‌మై ప్ర‌జా జీవ‌నం దెబ్బ తింటుంద‌ని పేర్కొన్నారు.

Also Read : అజ్మీర్ ద‌ర్గా మ‌త గురువు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!