HC Postpone : స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల ఎన్నిక వాయిదా

ఎన్నిక నిలిపి వేయాల‌ని కోర్టు ఆదేశం

HC Postpone : ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు సంబంధించి మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక ముగిసినా ఆప్, బీజేపీ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ తారా స్థాయికి చేరింది. చివ‌ర‌కు కొట్టుకునేంత దాకా సాగింది. కీలక ప‌ద‌వుల‌కు ఎన్నిక‌లు ముగిసినా మిగతా ఆరుగురు స్టాండింగ్ కమిటీ స‌భ్యుల‌కు సంబంధించి ఎన్నిక ర‌సాభాసగా మారింది. చివ‌ర‌కు కోర్టు ఆదేశాల మేర‌కు ఢిల్లీ మున్సిప‌ల్ బాడీ కీల‌క క‌మిటీకి ఎన్నిక‌లు వాయిదా(HC Postpone) ప‌డ్డాయి.

కొత్త‌గా కొలువు తీరిన మేయ‌ర్ షెల్లీ ఒబేరాయ్ ఒక ఓటు చెల్ల‌ద‌ని ప్ర‌క‌టించారు. ఇది బీజేపీ కౌన్సిల‌ర్ల‌లో ఆగ్ర‌హం వ్య‌క్తమైంది. చివ‌ర‌కు నిర‌స‌న వ్య‌క్త‌మైంది. అది తీవ్ర ఆందోళ‌న‌కు దారి తీసింది. ఒక‌రిపై మ‌రొక‌రు దాడుల‌కు దిగారు. ఎంసీడీ స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక నిన్న గొడ‌వ జ‌రిగింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై ఆప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది.

ఇప్ప‌టికే మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా ప‌డింది. మేయ‌ర్ చేసిన కీల‌క ప్ర‌క‌ట‌న రాద్దాంతానికి దారి తీసింది. బీజేపీ, ఆప్ కౌన్సిల‌ర్లు ముష్టి యుద్దానికి దిగారు. ఒక‌రినొక‌రు కొట్టుకోవ‌డం , త‌న్ను కోవ‌డం , చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం, నెట్ట‌డం గంద‌రగోళానికి దారి తీసింది.

ఆప్ కి చెందిన ఒబేరాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ డిల్లీ స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల‌ను సోమ‌వారానికి మార్చారు. ఇదిలా ఉండ‌గా స్టాండింగ్ క‌మిటీ అనేది నిధులు మంజూరు, ప్రాజెక్టుల‌ను నిర్ణ‌యించే ఎంసీడీలో కీల‌క పాత్ర పోషించ‌నుంది. అందుకే దీనిపై అంత పోటీ నెల‌కొంది.

Also Read : థ‌ర్డ్ ఫ్రంట్ వ‌ల్ల బీజేపీకి లాభం

Leave A Reply

Your Email Id will not be published!