#HealthNature : మెరుగైన ఆరోగ్యం..ప్ర‌కృతి తోనే సాధ్యం

మానవ జీవితంలో వ్యక్తిగత ఆరోగ్యం, పర్యావరణ పరిశుభ్రత అన్నది ప్రధానం. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిదీ అవసరమే. మనందరం బతకాలంటే గాలి, నీరు, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా వుంచు కోవాలి.

మానవ జీవితంలో వ్యక్తిగత ఆరోగ్యం, పర్యావరణ పరిశుభ్రత అన్నది ప్రధానం. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిదీ అవసరమే. మనందరం బతకాలంటే గాలి, నీరు, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా వుంచు కోవాలి. మనం ఎలా ఉండాలో మనకు మన ఉపాధ్యాయులు పాఠాల ద్వారా నేర్పిస్తున్నారు. వాటిని మనం ఆచరించాలి. అందరికంటే ముందు పరగడుపునే లేవాలి. కొంచం సేపు ధ్యానం చేయాలి. నోటిని శుభ్రం చేసుకోవాలి. చన్నీళ్లతో కానీ, వేడి నీళ్లతో కానీ స్నానం చేసు కోవాలి. మన ఇంటి చుట్టూ చెత్త, చెదారం ఉంటే తీసి వేయాలి. వీలైతే అమ్మకు సాయపడాలి. తలకు నూనె రాసు కోవడం, కళ్ళు, చెవులు, ముక్కును శుభ్రం చేసు కోవాలి. నోటి శుభ్రత మరీ ముఖ్యం. లేకపోతే లేని రోగాలు వస్తాయి. స్నానం చేసేటప్పుడు శరీరాన్ని బాగా సబ్బుతో రుద్దు కోవాలి. అన్నిటికంటే మనం ప్రతి రోజు వాడే బాత్ రూమ్, మరుగు దొడ్డిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే వుండాలి. ఎంత ఎక్కువగా నీళ్లను వాడితే వాసన రాకుండా ఉంటుంది. ఫినాయిల్ ను వాడాలి. లేకపోతే చర్మపు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నది.

మన బాడీలో ప్రతి భాగమూ ముఖ్యమైనది. ఇంట్లోశుభ్రాంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యాంగా ఉండగలం. వర్షాలు పడినప్పుడు పిల్లలమైన మనం తగు జాగ్రత్తగా ఉండాలి. స్వచ్ఛమైన నీళ్లను తాగాలి. ముసురు ఉన్నప్పుడు నీళ్లను వేడి చేసుకుని, చల్లారాక తాగాలి. మనం ప్రతి రోజు తీసుకునే ఆహారం మనకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి. అన్నిట్లోనూ కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసు కోవాలి. వీలైతే ప్రతి రోజు వ్యాయామం చేయాలి. బడిలో పీయీటీ ఆడించే ఆటల్లో పాల్గొనాలి. దీని వల్ల మన శరీరం గట్టి పడుతుంది. మనం ఎంత హెల్తీగా ఉంటామో మనం చదువుపై శ్రద్ధ పెట్టగలం. వ్యక్తిగత ఆరోగ్యంలో తినే ఆహారం, శరీరాన్ని శుభ్రం ఉంచుకునే తీరు, వ్యాయామం లాంటివి ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి. వ్యక్తిగతంగా శరీర శుభ్రత లేక పోవడం వల్లనే మనకు వ్యాధులు వస్తాయి. తల్లో పేళ్లు, గజ్జి, పుండ్లు, నీళ్ల విరేచనాలు, జ్వరం లాంటి జబ్బులు ఎక్కువగా వస్తాయి.

శుభ్రత పాటించే స్టూడెంట్స్ కు ఇవి రావు. వారానికి ఒకసారి తలంటు స్నానం చేయాలి. ప్రతి రోజు ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ముక్కును శుభ్రం చేసుకోక పోతే జలుబు వస్తుంది. దీంతో గాలి పీల్చడం ఇబ్బంది అవుతుంది. నోరు శుభ్రత లేకపోతే దుర్వాసనతో పాటు పళ్ళు త్వరగా పాడవుతాయి. పళ్ళపై గార ఏర్పడి దంతాలు పుచ్ఛి పోతాయి. ఉదయం నిద్ర లేచిన తర్వాత , నిద్ర పోయే ముందు , ఏదైనా తిన్న ప్రతి సారి నీళ్లతో బాగా నోటిని శుభ్రం చేసుకోవాలి. లేదంటే పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుని నోటి దుర్వాసన వస్తుంది. చాక్ లెట్లు , స్వీట్స్, ఐస్ క్రీమ్స్ , కేక్స్ వంటి పదార్థాలు తక్కువగా తినాలి. సాధ్యమైనంతగా పండ్లు, పాలు , పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలి. చర్మం శరీరాన్నంతా కప్పి శరీర ఉష్ణ్రోగ్రతను అదుపు చేసి శరీర అవయవాలకు రక్షణ కల్పిస్తుంది. మలిన పదార్థాలను చెమట రూపంలో బయటకు వదులుతుంది.

ఈ చెమట శరీరంపై అలాగే నిలువ వుంటే, ఎండిపోయి చెమట వచ్చే రంద్రాలను మూసి వేయటం వలన నిల్వ ఉండి పుండ్లు, గడ్డలు ఏర్పడతాయి. రోజు స్నానం చేయటం ద్వారా చర్మాన్ని శుభ్ర పరచుకోవాలి. మనం చేసే పనులన్నీ చేతుల ద్వారానే జరుగుతాయి. అన్నం తిన్నా, ముక్కు చీదినా, పేడ తీసినా చేతితోనే చేస్తాం. ఇన్ని రకాల పనులు చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన మలినాలన్నీ చేతికి అంటుకుంటాయి. గోళ్ళు పెద్దవిగా ఉంటే గోటి క్రింద మట్టి రూపంలో నిలువ ఉంటాయి. కాబట్టి గోళ్ళను పొట్టిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. మల విసర్జన తరువాత, భోజనం చేసే ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి. పిల్లలు మట్టిలో ఆడుతుంటారు. కనుక తరచుగా చేతులు కడుక్కోవటం అలవాటు చేయాలి. తినడానికి ఏదైనా, ఇచ్చే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి. గోళ్ళు ఎప్పటికప్పుడు తీసివేయాలి. మల, మూత్రాలు చేశాక కడుక్కోవాలి. వంట చేస్తున్న ప్రదేశాన్ని, పాత్రలను శుభ్రంగా వుంచు కోవాలి. కుళ్లిన పదార్థాలను చెత్త డబ్బాలో వేయాలి. వంట చేయటానికి ముందు, వడ్డించటానికి ముందు కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కూరగాయలు లాంటి పదార్థాలను బాగా కడగాలి.

గడువు తీరిన పదార్థాలను షాపులో తీసుకోరాదు. కొనరాదు. చిన్న గాయమైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఉండే ఇల్లు పరిశుబ్రాంగా ఉండాలి. ఇల్లు బాగుంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఇంటి లోపట, ఇంటి బయట శుభ్రాంగా ఊడ్చు కోవాలి. ఇంటి ముందు పెరట్లో మొక్కలు నాటాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా మొక్కలకు నీళ్లు పోయాలి. తప్పక చెత్త డబ్బాలలోనే వేయాలి. దీని వల్ల పర్యావరణం దెబ్బకునందా ఉంటుంది. మన ఇంటి ముందు ఉన్న జీవాలను ప్రేమించాలి. వీలైతే వాటికి నీళ్లు తాగించడం చేయాలి. పరిసరాలు అంటే మన ఇంటి తో పాటు పక్క వారు కూడా మనలాగే ఉండాలని మనం చెప్పాలి. ఇంటి ముందు ఉన్న మురుగు కాల్వను వారంలో మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. మన దుస్తులు, చెప్పులు, మన వేష ధారణ బాగా ఉంటే మనం ఆరోగ్యాంగా ఉన్నట్టు. వ్యక్తిగత ఆరోగ్యం , పర్యావరణాన్ని కాపాడేలా చేస్తుంది. ఇది మనందరి భాద్యత. మన సీఎం చెప్పినట్టు హరిత హారంలో భాగం కావాలి. మొక్కలు నాటాలి.

No comment allowed please