MBA : ఓ కంపెనీని నడిపించాలంటే తెలివితో పాటు కాస్తంత నైపుణ్యం కూడా అవసరం. మనకు తెలిసిందల్లా ఇంజనీరింగ్, డాక్టర్లు మాత్రమే. కానీ వీటితో పాటు ధీటుగా ఎక్కువగా డిమాండ్ ఉన్న కోర్సులలో మేనేజ్‌మెంట్, కంపెనీ సెక్రటరీ కోర్సులు. వీటిని మన విద్యార్థులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఇటీవల సైబర్ సెక్యూరిటీ పరంగా ప్రతి కంపెనీ తమ తరపున న్యాయ పరమైన చిక్కులు తొలగించేందుకు న్యాయ నిపుణులను నియమించు కుంటున్నాయి. వీటికి కూడా భారీ ప్యాకేజీలతో ఆహ్వానం పలుకుతున్నాయి బడా కంపెనీలు.
ఇండియాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో చదివిన కుర్రాళ్లకు ఎక్కడ లేనంత డిమాండ్ ఉంటోంది ప్రపంచ వ్యాప్తంగా. అంతే కాకుండా ఇక్కడి విద్యార్థులకు విదేశాలలో మంచి కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. అక్కడి మేనేజమెంట్ కోర్సుల్లో చేరాలంటే కంపల్సరీగా జీమ్యాట్ పాస్ కావాల్సిందే. లేకపోతే అడ్మిషన్ దొరకదు. గత నాలుగేళ్లలో జీమ్యాట్ టెస్టుకు హాజరైన వారి సంఖ్య రెట్టింపు అవుతోంది.
ఏకంగా 12 శాతం పెరిగింది. ఇంజనీరింగ్ చేసిన వాళ్లు సైతం మేనేజ్‌మెంట్ ను ఎంచుకుంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్, యుకె, జర్మనీ, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, తదితర దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. క్యాట్ కు కూడా ఎక్కువగా హాజరవుతున్నారు. అక్కడి ఇనిస్టిట్యూట్‌లు ట్రిపుల్ క్రౌన్ గుర్తింపు పొందాయి. ఆయా సంస్థలలో ఎంబీఏ పూర్తి చేస్తే అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. కెరీర్ అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి.
ఎంబీఏతో పాటు పీజీ డిప్లొమా, మాస్టర్స్ ఇన్ మేనేజ్ మెంట్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్, అకౌంటింగ్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, టెలికాం, ఫార్మా మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఫారిన్ ట్రేడ్ ఇలాంటి స్పెషలైజేషన్స్‌తో ఆఫర్ చేస్తున్నాయి. ఖర్చు పరంగా వీటినే ఎంచుకుంటున్నారు. కోర్సు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగం లభిస్తోంది.
No comment allowed please