KCR Jobs : కొంత కాలంగా ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు తీపి కబురు అందించారు సీఎం కేసీఆర్(KCR Jobs). రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఇప్పటి దాకా 80 వేల 39 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. వాటిని నేరుగా భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయా శాఖల వారీగా సీఎం (KCR Jobs)తనే స్వయంగా ప్రకటించారు అసెంబ్లీలో. హోం శాఖలో 18, 334 పోస్టులు,
సెకండరీ ఎడ్యుకేషన్ లో 13, 086, హయ్యర్ ఎడ్యుకేషన్ లో 7, 878 , వైద్య ఆరోగ్య శాఖలో 12 వేల 755 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
వీటికి వెంటనే ఇవాల్టి నుంచే నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఆరోగ్య, మెడికల , కుటుంబ సంక్షేమ శాఖ లో జాబ్స్ ఉన్నాయి.
ఇక బీసీ సంక్షేమ శాఖలో 4 వేల 311 , రెవిన్యూ శాఖలో 3, 560 , ఎస్సీ వెల్ఫేర్ శాఖలో 2 వేల 879, నీటి పారుదల శాఖలో 2 వేల 692 జాబ్స్ ఉన్నాయి.
గిరిజన సంక్షేమ శాఖలో 2 వేల 399, మైనార్టీ సంక్షేమ శాఖలో 1, 825 పోస్టులు,
పర్యావరణ, అటవీ, సైన్స్ , టెక్నాలజీలో 1, 598 , కార్మిక, ఉపాధి శాఖలో 1,221 జాబ్స్ ఖాళీగా ఉన్నాయి.
ఆర్థిక శాఖలో 1,146 పోస్టులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ శాఖలో 895 జాబ్స్ , పురపాలిక పరిపాలన,
అర్బన్ డెవలప్ మెంట్ లో 859 పోస్టులు, అగ్రికల్చర్ కోఆపరేషన్ శాఖలో 801 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు కేసీఆర్.
ఇక న్యాయ శాఖలో 386 జాబ్స్ ఉండగా పశు పోషణ, మత్స్య విభాగంలో 353 జాబ్స్ ,
జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో 343 , ఇండస్ట్రీస్ కామర్స్ లో 233 పోస్టులు ఉన్నాయని తెలిపారు.
ఇక యూత్ , టూరిజం, కల్చర్ శాఖలో 184 పోస్టులు, ప్లానింగ్ లో 136 , ఫుడ్ , సివిల్ సప్లయిస్ లో 106 , లెజిస్లేచర్ లో 25 జాబ్స్ , ఎనర్జీలో 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు సీఎం.
Also Read : తెలంగాణలో శాఖల వారీగా ఖాళీలు