Chennai Heavy Rain : భారీ వర్షం తమిళనాడు అతలాకుతలం
30 ఏళ్లలో చెన్నైలో అత్యధికంగా 8.4 సెం.మీ
Chennai Heavy Rain : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు తల్లడిల్లుతోంది. గత 30 ఏళ్లలో తమిళనాడు రాజధాని చెన్నైలో 24 గంటల్లో వర్షపాతం 8.4 సెంటీమీటర్లుగా నమోదైంది.
ఇక భారీ వర్షాల తాకిడికి వణుకుతోంది చెన్న(Chennai Heavy Rain) పట్టణం. చెన్నైతో పాటు తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్ పేట , తదితర ప్రాంతాల్లో వర్షాల కారణంగా బడులు మూసి వేశారు. చెన్నైతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
రహదారులు నీటితో నిండి పోయాయి. అత్యధిక వర్షం కురియడం ఇదే మొదటిసారి. నిన్నటి నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మంగళవారం కూడా వర్షం కొనసాగుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల దెబ్బకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
తీవ్రమై నీటి ఎద్దడితో పాటు పలువురు బయటకు వెళ్లలేక నానా తంటాలు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీటిలో రోడ్లపై నడిచేందుకు కూడా ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో పాదచారులు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గణేశపురం వంటి సబ్ వేలతో సహా అనేక ప్రాంతాలను చెన్నై కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
వరదలు వచ్చే అవకాశం ఉన్న పరిసరాల్లో వరద పర్యవేక్షణ కెమెరాలు ఏర్పాటు చేశారు. చెన్నై మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్టు కారణంగా పలు రహదారులపై బారికేడ్లు ఉంచారు.
ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుగా తమిళనాడులో నవంబర్ 5 వరకు వర్షాలు వస్తాయని భారీ హెచ్చరికలు జారీ చేసింది. 4 వరకు ఎల్లో అలర్ట్ ఉంటుంది.
అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కోరారు సీఎం ఎంకే స్టాలిన్.
Also Read : శ్రీవారి బ్రేక్ దర్శనంలో కీలక మార్పు