Heavy Rains : పలు చోట్ల భారీగా వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం
Heavy Rains : ఈశాన్య బంగాళా ఖాతంలో అల్ప పీడనం కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలలో మోస్తరు నుంచి అతి మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణలలో వర్షాలు ఎడ తెరిపి లేకుండా పడుతున్నాయి. దీంతో చాలా చోట్ల జన జీవనం స్తంభించి పోయింది. రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది.
Heavy Rains in AP & TS
అల్ప పీడనం ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడు, ఉత్తర కర్ణాటకలలో కంటిన్యూగా వర్షాల తాకిడి కొనసాగుతోంది. విదర్భ నుంచి దక్షిణ కర్ణాటక దాకా ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమలలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీగా వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏపీలో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.
దీంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చూడాలని చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా దేశంలోనే అత్యధికంగా కావలిలో 39.6 డిగ్రీల గరిష్ట ఉష్ట్రోగ్రత నమోదైంది. తెలంగాణలో సైతం చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి ఎడ తెరిపి లేకుండా కురిశాయి.
Also Read : Tirumala Heavy Rush : తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం