Heavy Rains Hyderabad : భాగ్య‌న‌గ‌రం అత‌లాకుత‌లం

గంట‌ల కొద్దీ ట్రాఫిక్ జామ్

Heavy Rains Hyderabad : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ న‌గ‌రం త‌డిసి పోయింది. ఎక్క‌డ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వంద‌లాది వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచి పోయాయి. ఐకియా సెంట‌ర్ లో వేలాది వాహ‌నాలు రెండు గంట‌ల‌కు పైగా రోడ్డుపైనే ఉండి పోయాయి. దీంతో వాహ‌న‌దారులు నానా తంటాలు ప‌డ్డారు. అస‌లు ఏం జ‌రుగుతుందో తెలియ‌క నానా తంటాలు ప‌డ్డారు.

Heavy Rains Hyderabad Continues

ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. అయినా స‌ర్కార్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. సెల‌వులు ప్ర‌క‌టించి ఉంటే కొంత మేర‌కు ఈ ఇబ్బంది ఉండేది కాదు.

వ‌ర్షాల(Heavy Rains) తాకిడి రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. నాలాలు, మురుగు కాల్వ‌లు, విద్యుత్ స్తంభాల వ‌ద్ద ఎవ‌రూ ఉండ కూడ‌ద‌ని హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ హెచ్చ‌రించింది. సిబ్బంది స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.

జూలై 28 శుక్ర‌వారం వ‌ర‌కు హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. న‌గ‌ర వాసులు అత్యంత అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించింది.

Also Read : Kumbham Anil kumar Reddy : కోమ‌టిరెడ్డి వల్లే పార్టీ మారా

Leave A Reply

Your Email Id will not be published!